కడప: వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల స్థాపించిన వైయస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేరళ శాఖ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఆ రాష్ట్రానికి చెందిన ఓ పార్టీ నేతలు పరమేశ్వరన్, కార్యదర్శి మనోజ్ శంకర్నెట్లూర్ ఈ విషయం చెప్పినట్లుగా తెలుస్తోంది. వారు మీడియాతో మాట్లాడారు. తమ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ శాఖను ఏర్పాటు చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారన్నారు. అక్కడ పార్టీ శాఖను ఏర్పాటు చేస్తే పంచాయతీ సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నారు.
పార్టీ శాఖ ఏర్పాటు గురించి చర్చించడానికే తాము కడప జిల్లాకు వచ్చినట్లు తెలిపారు. జగన్మోహన్రెడ్డి అనుమతి ఇస్తే నవంబర్లో కోచిలో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ఉండటంతో తమ రాష్ట్ర ప్రజలూ పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారని వారు తెలిపారు.