వ‌రుడు కాబోతున్న చ‌ర‌ణ్‌ :CineJwala Telugu:

Posted on

మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజకు వివాహం దాదాపు నిశ్చయమైనట్లు ఒక ఆంగ్ల పత్రిక ప్రముఖంగా ప్రచురించింది. అపోలో ఆస్పత్రి ఛైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి మనుమరాలు కామినేని ఉపాసిని ఆయన వివాహమాడబోతున్నట్లు ఆ పత్రిక తెలిపింది.కొద్ది రోజుల క్రితం చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా అపోలో రెడ్డి కుటుంబాన్ని కలిసి మాట్లాడారట.చిరంజీవి కుటుంబ సభ్యులతోపాటు అల్లు అరవింద్ కూడా ఉపాసిని తల్లిదండ్రులను కలిసి ఈ విషయమై చర్చించారు. నిజానికి చరణ్ తేజ రెండేళ్లపాటు ఆగుదామని అనుకుంటున్నప్పటికీ చిరంజీవి మాత్రం ఇదే సరైన సమయం అని చెప్పి కుమారుడిని ఒప్పించిటనట్లు చెబుతున్నారు. అల్లు అర్జున్ కొద్దికాలం క్రితం స్నేహ రెడ్డిని వివాహం చేసుకున్న తర్వాత చరణ్ తేజపై కూడా తన చిన్ననాటి స్నేహితురాలు ఉపాసినిని పెళ్ళి చేసుకోవచ్చని ప్రచారం జరిగింది. చరణ్ తేజ కోరిక మేరకు ఆమెను పెళ్లాడడానికి చిరంజీవి కూడా అంగీకరించారు.ఈ ఏడాది ఆఖరుకు రామ్ చరణ్ తేజ వివాహం జరగవచ్చు.