ఈమధ్య తెలుగు సినిమాకి బ్యాంకాక్ నగరం కేరాఫ్ అడ్రస్ అయిపోయింది. చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు, ఇంచుమించు ప్రతి సినిమా షూటింగూ ఎంతో కొంత అక్కడ జరుగుతూనే వుంది. ఈమధ్య కాలంలో ప్రతి రోజూ అక్కడ ఏదో ఒక తెలుగు సినిమా షూటింగు జరుగుతూనే వుందంటే అతిశయోక్తి కాదు. ప్రభాస్ తన 'రెబల్' షూటింగ్ రెండు రోజుల క్రితమే పూర్తి చేసుకుని రాగా, రాం చరణ్ 'రచ్చ' కోసం, వరుణ్ సందేశ్ 'ప్రియుడు' కోసం కొన్ని రోజులుగా అక్కడే వున్నారు. తాజాగా యన్టీఆర్ కూడా వెళ్ళాడు. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో రూపొందుతున్న 'ఊసరవెల్లి' సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను, యాక్షన్ ఎపిసోడ్ ను అక్కడ చిత్రీకరిస్తున్నారు.