పూర్వం ఎన్.టి.ఆర్, ఏ.ఎన్.ఆర్ , కృష్ణ వంటి దిగ్గజాలు చిత్ర పరిశ్రమలో ఉండగా,ఏడాది కి కనీసం 3-4 సినిమాలు చేస్తూ పరిశ్రమను కళకళలాడించేవారు.
నేటి యువ కథానాయకులు ఇందుకు పూర్తిగా విరుద్ధం.సంవత్సరానికి ఒక సినిమా చేయటం ఆనవాయితీ అయిపోయింది. కొందరైతే ఏకంగా ఒక్కో సినిమాకు 2 సంవత్సరాలు తీసుకుంటున్నారు. దీని వలన పరిశ్రమకు ఎంత నష్టం వాటిల్లుతోందో పలు మార్లు చర్చించారు.
అయితే వీరందరికీ అల్లరి నరేష్ ఆదర్శంగా నిలవాలి. కనీసం ఏడాదికి 3 మినిముం గ్యారంటి సినిమాలతో పరిశ్రమను అలరిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా “మడత ఖాజా” మరియు తమిళంలో “పొరలి” అనే చిత్రాలలో నటిస్తున్నాడు. పగటి పూట హైదరాబాద్ లో తెలుగు సినిమా షూటింగ్ చేసుకుని, రాత్రి కి చెన్నై కి విమానయానం చేసి అక్కడ పొరలి షూటింగ్ చేసుకుంటున్నాడు.తిరిగి తెల్లవారు జామున హైదరాబాద్ చేరుకుంటున్నాడు. గత వారం రోజులుగా ఇదే కొనసాగుతోంది.
అల్లరి నరేష్ అంకిత భావాన్ని, కష్ట పడే తత్వాన్ని పలువురు ప్రముఖులు హర్షిస్తున్నారు.