తెలుగు సినీ పరిశ్రమలో నష్టాలకు ప్రధాన కారణం భారీ బడ్జెట్ సినిమాలే అని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. భారీ సెట్టింగులు, ఖరీదైన విదేశీ లొకేషన్లు, అందమైన ముద్దు గుమ్మల కోసం భారీగా ఖర్చు పెడుతున్న దర్శక నిర్మాతలు కథ, కథనంపై సరైన దృష్టి సారించక పోవడమే ఇందుకు కారణమనే విమర్శలు కూడా ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలు తీస్తే పరిశ్రమ పచ్చగా ఉంటుందనేది సినీ పండితుల అభిప్రాయం.
ఇదిలా ఉండగానే... మరోవైపు టాలీవుడ్ లోని ముగ్గురు అగ్రహీరోలు బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు భారీ బడ్జెట్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్దం అవుతున్నారు. బాలకృష్ణ నటించిన శ్రీరామరాజ్యం రూ. 30 కోట్లతో రూపొందించారు. పౌరాణిక నేపథ్యం ఉన్న సినిమా కావడంతో సెట్టింగులకు భారీగా ఖర్చుపెట్టారు. నాగార్జున ‘ఢమరుకం’ సినిమా రూ. 40 కోట్లతో రూపొందిస్తున్నారు. ఇక వెంకటేష్ హీరోగా వస్తున్న ‘బాడీగార్డు’ సినిమా కోసం రూ. 25 కోట్లు ఖర్చు చేస్తున్నారు.
పాపులర్ తారాగణం, పేరుమోసిన దర్శకుల కాబినేషన్లో గతంలో వచ్చిన పలు సినిమాలు ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో.... త్వరలో రాబాయే ఈ ముగ్గురు హీరోల భారీ బడ్జెట్ సినిమాలను భారీగా పెట్టుబడులు పెట్టి కొనడానికి బయ్యర్లు, ఎగ్జిబిటర్లు జంకుతున్నారు. మరి ఈ భారీ బడ్జెట్ సినిమాల ఫలితాలు ఏ విధంగా ఉంటాయో వేచి చూడాల్సిందే.