బాలీవుడ్ భామ విద్యా బాలన్ పెళ్లికి సిద్ధమైనట్లు గత కొంత కాలంగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. సిద్దార్థరాయ్ కపూర్ తో ఆమె జీవితం పంచుకోబోతోందని, పెళ్లి తర్వాత ఆమె సినిమాలకు దూరం కాబోతోందని, ‘డర్టీ పిక్చర్’ విద్యా చివరి సినిమా అంటూ....పుకార్లు షికార్లు చేశాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం...విద్యా పెళ్లి వార్తలన్నీ అబద్దమని, ఆమె నటిస్తున్న డర్టీ పిక్చర్ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు పెంచడంలో భాగంగానే దర్శక నిర్మాతలు ఇలాంటి ప్రచారాన్ని వెలుగులోకి తెచ్చారని సమాచారం.
ఇలాంటి ప్రచారం వల్ల తనకు వ్యక్తిగతంగా నష్టం వాటిల్లు తుండటంతో ఇకపై ఈ ప్రచారానికి పులిస్టాప్ పెట్టాలని ఆమె యోచిస్తోందట. త్వరలో సినిమా దర్శక నిర్మాతలను కలిసి ఈ విషయంపై చర్చించనుందట. ఒకప్పటి దక్షిణాది ఐటం గర్ల్....సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ‘డర్టీ పిక్చర్’ రూపొందుతున్న విషయం తెలిసిందే.