గత కొన్ని రోజులుగా వివిధ అంశాలపై ప్రతిపక్షం అడ్డుపడటంతో సజావుగా సాగకుండా గందరగోళానికి, వాయిదాలకు ఆలవాలంగా మారిన పార్లమెంట్ ఎట్టకేలకు గురువారం శాంతించింది. అన్ని పార్టీల సభ్యులు హాజరై పార్లమెంట్ ప్రశాంతంగా సాగడానికి సహకరించారు. దీంతో ఈ వర్షాకాల సమావేశాల్లో తొలిసారి గురువారం ప్రభుత్వం ఉభయ సభల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందగలిగింది. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగింది. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుకు సంబంధించిన ముఖ్యమైన పత్రాలను ప్రభుత్వం సమర్పించింది. ఒక్కసారి కూడా వాయిదా పడకుండా వీటిపై చర్చలు జరిగాయి. రెండు గంటల చర్చ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బిఐ) అనుబంధ బ్యాంకులపై ప్రభుత్వానికి పూర్తి నియంత్రణను కల్పించే బిల్లును లోక్‌సభ ఆమోదించింది. మరోవైపు రాజ్యసభ నాణేలకు సంబంధించిన కాయినేజ్ బిల్లు-2009ను ఆమోదించింది.
ఆగస్టు 1న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో నిన్నటి వరకు ప్రతిపక్ష సభ్యులు వివిధ అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ వచ్చారు. కామనె్వల్త్ క్రీడల నిర్వహణలో జరిగిన అక్రమాలు, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, ఢిల్లీలో అవినీతికి వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో బిజెపి కార్యకర్తలపై పోలీసుల లాఠీచార్జి వంటి అంశాలపై ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బిజెపి సభ్యులు సభాకార్యకలాపాలను అడ్డుకుంటూ వచ్చారు. మొదటి పది రోజుల్లో ఉభయ సభల్లోనూ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని దాదాపు ప్రతి రోజూ అడ్డుకున్నారు. దీంతో బుధవారం నాటికి లోక్‌సభలో 160 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 14 ప్రశ్నలకు మాత్రమే ఇచ్చారు. రాజ్యసభలో 160 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉండగా కేవలం 18 ప్రశ్నలకే ఇచ్చారు. ఈ వర్షాకాల సమావేశాల ప్రారంభ సెషన్‌లో 32 బిల్లులను ప్రవేశపెట్టాల్సి ఉండగా, ఇప్పటి వరకు కేవలం ఐదు బిల్లులను మాత్రమే ప్రవేశపెట్టారు. షెడ్యూలు ప్రకారం 35 బిల్లులు ఆమోదం పొందాల్సి ఉండగా, బుధవారం వరకు ఇందులో ఒక్క బిల్లు కూడా ఆమోదం పొందలేదు.