మళ్లీ కామెడీ వేషాలేద్దామా?, సునీల్ అంతర్మథనం :CineJwala Telugu:

Posted on

తెలుగు సినిమా పరిశ్రమలో అతి తక్కువ కాలంలో కామెడీ స్టార్ గా ఎదిగిన వారిలో సునీల్ ఒకరు. తన కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ హీరో వేషాల వైపు తన దృష్టి మళ్లించాడు. తొలుత అందాల రాముడు సినిమాలో నటించినా కలిసి రాక పోవడంతో మళ్లీ ప్రముఖ హీరోల సినిమాల్లో కామెడీ పాత్రలు చేయడం మొదలు పెట్టిన విషయం తెలిసిందే.

అదే సమయంలో రాజమౌళి రూపంలో సునీల్ కు అదృష్టం కలిసొచ్చింది. రాజమౌళి సూచనలు మేరకు తన బాడీని హీరో రేంజ్ లో మెల్ట్ చేసుకుని ‘మర్యాద రామన్న’ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ సినిమా అందించిన విజయంతో ఇకపై హీరో పాత్రలు మాత్రమే చేయాలని డిసైడ్ అయ్యాడు.

అయితే సునీల్ ఇంత కష్టపడి పెంచుకున్న ఇమేజ్ ‘అప్పల్రాజు’తో అప్పడం చేశాడు రాంగోపాల్ వర్మ. దీంతో ఇటు హీరో అవకాశాలు రాక, అటు కామెడీ వేషాలు చేయలేక....ఖాళీగా ఉంటున్న సునిల్ కు ఇటీవల వీరభద్రం చౌదరి దర్శకత్వంలో హీరోగా నటించే అవకాశం దక్కింది. అయితే ఆ సినిమా ఎప్పడు పూర్తవుతుందో? తెలియదు. పూర్తయినా హిట్టవుతుందని, మళ్లీ సినిమా అవకాశాలతో బిజీగా ఉంటాడనే గ్యారంటీ లేదు. అందుకే ఇటు కామెడీ వేషాలు వేయడంతో పాటు, అవకాశాలు వచ్చినప్పడు హీరోగా చేసేందుకు సునీల్ సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. అతని స్నేహితులు కూడా సునీల్ కు ఇలాంటి సూచనలే ఇస్తున్నారట.