జేపీకి తాకిన సమైఖ్య సెగ :CineJwala Telugu:

Posted on

విశాఖపట్నం: లోక్‌పాల్ ప్రచారయాత్రలో భాగంగా శనివారం విశాఖ వచ్చిన లోక్‌సత్తా పార్టీ అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణను సమైక్యాంధ్ర నాయకులు అడ్డుకున్నారు. చినవాల్తేరు లోక్‌సత్తా కార్యాలయంలో జేపీ ఉన్నారని తెలుసుకుని అక్కడికి వచ్చిన సమైక్యవాదులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 14ఎఫ్ రద్దుపై హర్షం వ్యక్తం చేసిన జేపీ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. జేపీ వచ్చి సర్దిచెప్పడంతో ఆందోళన సద్దుమణిగింది. జేపీ అక్కడి నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన ప్రచార యాత్రకు చేరుకోగా, అప్పటికే అక్కడున్న సమైక్యవాదులు ఆయన్ని అడ్డుకున్నారు. ‘జేపీ డౌన్ డౌన్’ అంటూ నినాదాలు చేశారు.

కాగా, 14ఎఫ్ రద్దుపై సీమాంధ్రలో ఆందోళనలు వ్యక్తమవుతున్నా...ఆ నష్టానికి సంబంధించిన ఆధారాలు లేవని జేపీ వ్యాఖ్యానించారు. విశాఖ విమానాశ్రయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 14-ఎఫ్ రద్దు చేయాలన్న తొలి డిమాండ్ తమ పార్టీదేననీ, అన్నిపార్టీలను ఒప్పించి అసెంబ్లీలో తీర్మానం చేయించామని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయ సంక్షోభాన్ని అధిగమించొచ్చన్న దానికి ఈ పరిణామం ఒక ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.