ముంబై: ప్రముఖ హిందీ నటుడు షమ్మీకపూర్ (79) మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన కిడ్నీల సమస్యతో బాధపడుతున్నారు. బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ (ఆదివారం)ఉదయం ఆయన కన్నుమూశారు. ఆయన నటించిన తొలి చిత్రం జీవనజ్యోతి. ఈ చిత్రాన్ని 1953లో నిర్మించారు. 1931 అక్టోబరు 21న ఆయన పంజాబ్లో జన్మించారు.