హైదరాబాద్: సిబిఐ దర్యాఫ్తు విషయంలో వైయస్సాఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై దివంగత ముఖ్యమంత్రి, ఆయన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి సైతం కక్ష కట్టినట్లేనా అని ఆరు సూత్రాల కమిటీ చైర్మన్ తులసి రెడ్డి ప్రశ్నించారు. జగన్ ఆస్తులపై సిబిఐ దర్యాఫ్తు వెనుక కుట్ర అనడం సరికాదన్నారు. జగన్ ఆస్తులపై కుట్ర పూరితం అంటున్న వారు గతంలో తెలుగుదేశం పార్టీ నేత పరిటాల రవి హత్య జరిగిందని అందులో జగన్ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చినప్పుడు తన తనయుడు అని చూడకుండా సిబిఐ విచారణకు ఆదేశించారని అన్నారు. అలా అంటే అప్పుడు వైయస్ రాజశేఖర రెడ్డి తన తనయుడిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడినట్లేనా అని ప్రశ్నించారు. జగన్ సిబిఐ విచారణకు సహకరించి తన నిజాయితీ నిరూపించుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పాలన రాష్ట్రానికి ఆశాకిరణం అని ఆయన అన్నారు. రాష్ట్రం అన్ని రంగాలలో ముందంజలో వెళుతుందన్నారు