తెలంగాణ ఉద్యోగుల సమ్మె సమాప్తం :సినీ జ్వాల తెలుగు:

Posted on

హైదరాబాద్: తెలంగాణ లక్ష్య సాధనకు గత 40 రోజులుగా సకలజనుల సమ్మెను సాగిస్తూ ప్రభుత్వానికి దడ పుట్టించిన తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఎట్టకేలకు తమ ను విరమించింది. అయితే ప్రభుత్వం ముందు 9 డిమాండ్లను ఉంచింది. ఈ డిమాండ్లలో కొన్ని కీలక డిమాండ్లను మాత్రం ప్రభుత్వం న్యాయపరమైన చిక్కులున్నాయని చెప్పింది.ఇక సమ్మె కాలానికి జీతం చెల్లించాలన్న ఉద్యోగుల డిమాండ్‌ను ప్రభుత్వం అంగీకరించలేదు. నో వర్క్ నో పే అమలు దరిమిలా ఒకవేళ ఈ డిమాండ్‌ను అంగీకరిస్తే చిక్కులు తలెత్తుతాయని తేల్చింది.అయితే, అందుకు తెలంగాణ ఉద్యోగ సంఘాల జెఎసి నేతలు సిద్ధంగా లేరు.
 ఇక ఉద్యోగులపై పెట్టిన కేసులన్నిటినీ ఎత్తివేయాలన్న డిమాండ్‌పైన కూడా ప్రభుత్వం ఆచితూచి స్పందించినట్లు తెలిసింది.ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనని ఉద్యోగులపై ఒకవేళ కేసులు పెడితే ఎత్తివేస్తామని తెలిపింది. మొత్తమ్మీద సమ్మె విరమణ పత్రాలపై టి.ఉద్యోగ సంఘాల నేతలు సంతకాలు చేయడంతో సకలం ముగిసింది. రేపట్నుంచి వీరంతా విధులకు హాజరుకానున్నారు. సమ్మె కాలాని అడ్వాన్స్ జీతాన్ని ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది .