హైదరాబాద్ : టీ- రాజకీయ నేతలు తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనాలని టీఎన్జీవోల కన్వీనర్ స్వామిగౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ సాధనలో ఉద్యోగులది ఉడుత సాయమేనన్నారు. ప్రపంచ పోరాటాల్లో ఇటువంటి ఉద్యమం ఎక్కడా కనిపించిదని ఆయన పేర్కొన్నారు.ప్రజాప్రతినిధులు అండగా నిలబడాలన్న ఉద్దేశంతోనే తాము సమ్మెలో పాల్గొన్నామని ఆయన తెలిపారు. ఉద్యోగుల సమ్మె విరమణ నేపథ్యంలో ఆయన ఈరోజు టీఎన్జీవో భవన్‌లో మీడియాతో మాట్లాడారు. కాగా టీ-ఉద్యోగులను చూసి టీ- రాజకీయ నేతలు సిగ్గుతెచ్చుకోవాలని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవి వదిలిన తనకు పార్టీని వదలిపెట్టడం పెద్ద సమస్యకాదన్నారు. ఉద్యమాలతోనే తెలంగాణ వస్తుందన్నారు.ఉద్యోగులను వేధిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.