'ఉధృతమవుతోన్న సమైక్యాంధ్ర ఆందోళనలు' :సినీ జ్వాల తెలుగు:

Posted on

విశాఖపట్నం: రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలనే డిమాండు సీమాంధ్ర ప్రాంతంలో రోజు రోజుకూ ఉధృతమవుతోంది. విశాఖ జిల్లా శాసనసభ్యుడు ద్రోణంరాజు శ్రీనివాస్ ఇంటిని సమైక్యాంధ్ర విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి నేతలు ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర ప్రభుత్వంతో స్పష్టమైన ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే సహించేది లేదన్నారు.కాగా సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచుతామని ప్రకటన చేయాలని కేంద్రానికి నవంబర్ 1వ తేది డెడ్ లైన్ విధించిన విషయం తెలిసిందే. ఐకాస ప్రకటన మేరకు గత నాలుగైదు రోజులుగా సీమాంధ్రలో సమైక్య రాష్ట్రం కోసం ఆందోళనలు జరుగుతున్నాయి. డెడ్ లైన్ లోగా కేంద్రం సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ప్రకటన చేయకుంటే ఆ తర్వాత అసెంబ్లీ ముందు దీక్షకు దిగుతామని హెచ్చరించారు.