తిరిగి డబ్బులు చెల్లిస్తే అది నేరంకాదా: దిగ్విజయ్ :సినీ జ్వాల తెలుగు:

Posted on

న్యు ఢిల్లీ: ఆమరణ నిరాహారదీక్షా సమయంలో కార్యకర్తల నుంచి వసూలు చేసిన చందా డబ్బులు వెనక్కి తిరిగి ఇస్తే నేరం కాకుండా పోతుందా అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ ప్రశ్నించారు. టీమ్ అన్నా సభ్యురాలు కిరణ్ బేడీ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ అవినీతికి పాల్పడిన వారందరూ తిరిగి డబ్బులు చెల్లిస్తే అది నేరం కాకుండా పోతుందా అని నిలదీశారు.అలా అయితే  కేంద్ర టెలికామ్ మాజీ మంత్రి ఏ.రాజా, రాజ్యసభ సభ్యురాలు కనిమొళి, సురేష్ కల్మాడీలు జైలులో ఎందుకు ఉండాలని ఆయన ప్రశ్నించారు. అవినీతి అక్రమాల ద్వారా వారు కూడబెట్టుకున్న డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేసి జైలు నుంచి బయటకు రావొచ్చు కదా అని అన్నారు.అంతేకాకుండా, అన్నా బృందం సభ్యుడు అరవింద్ కేజ్రీవాల్‌కు భారతీయ జనతా పార్టీ యువ ఎంపీ వరుణ్‌గాంధీ మద్దతుగా నిలవడాన్ని దిగ్విజయ్ నిలదీశారు. ఇది అన్నా హజారేకు భారతీయ జనతా పార్టీ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘానికి ఉన్న బంధాన్ని నిరూపిస్తోందన్నారు.