న్యూఢిల్లీ: సకల జనుల సమ్మెలో భాగంగా బుధవారం ఉదయం 10 గంటలకు బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఇందిరా పార్క్ వరకు ర్యాలీని నిర్వహించి అనంతరం మహాధర్నాను తెలంగాణ రాజకీయ ఐకాస నిర్ణయించింది. దీనిపై ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ ర్యాలీ, మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. జేఏసీలోని భాగస్వామ్య పార్టీలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, ఇతర సంఘాల నాయకులు, ప్రతినిధులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ ధర్నాకు, మహాధర్నాకు పోలీసుల అనుమతి ఉందన్నారు. 18,19 తేదీల్లో జిల్లాల జేఏసీలు స్టీరింగ్ కమిటీ సమావేశాలను నిర్వహించాలని ఆయన కోరారు. 20 నుంచి మండల, 25 నుంచి జిల్లా స్థాయి సదస్సులను నిర్వహించాలని, కోదండరామ్పిలుపునిచ్చారు.