రాంగోపాల్ వర్మకు బెదిరింపు నోటీస్ :CineJwala Telugu:

Posted on

నీరజ్ గ్రోవర్ హత్యోదంతం ఆధారంగా రాంగోపాల్ వర్మ 'నాట్ ఏ లవ్ స్టోరీ' పేరుతో ఓ చిత్రాన్ని రూపొందించిన సంగతి మనకు తెలుసు. ఇప్పుడీ చిత్రానికి సంబంధించి వర్మ ఓ లీగల్ నోటీసు అందుకొన్నాడు. ఈ హత్య కేసులో జైలు శిక్ష అనుభవించి ఇటీవలే బయటకు వచ్చిన టీవీ నటి మేరియా సుసై రాజ్ ఈ నోటీసు ఇచ్చింది. ఈ సినిమాలో తన పాత్రను ఎలా చిత్రీకరించారన్న విషయాన్ని తెలుసుకోవడం కోసం విడుదలకు ముందుగా, సినిమా చూడాలనుకుంటున్నట్టు నోటీసులో పేర్కొంది. ఒకవేళ సినిమా చూపడానికి తిరస్కరిస్తే కనుక కోర్టులో కేసు వేస్తానని కూడా ఆమె తెలిపింది.
            ఇదిలా ఉంచితే,  మేరియా నుంచి నోటీసు అందుకున్న విషయాన్ని వర్మ కూడా ధ్రువీకరించాడు. అయితే, తను మాత్రం ఆమెకు సినిమా చూపించననీ, ఆ నోటీసుకి తన లాయర్ సమాధానమిస్తారనీ వర్మ చెబుతున్నాడు. మేరియా తనను స్వయంగా అడిగి వుంటే తప్పకుండా సినిమా చూపించి వుండేవాడిననీ, అయితే ఇలా బెదిరింపు ధోరణిలో నోటీసు పంపడం వల్ల చూపించే ప్రసక్తే లేదనీ అంటున్నాడు. ఏమైతేనేం, వర్మ కోరుకునే 'ఫ్రీ పబ్లిసిటీ' ఏదో రూపంలో వస్తూనే వుంది!